ఆత్మకూరు, మార్చి25 (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని సిద్దిపురం పంచాయితీ పరిధిలో ఉన్న అనసూయ నగర్ గ్రామం నందు పరిధిలో బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని అనసూయ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అన్నా రెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు మెట్టు విజయ్ కృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన బిజెపి టిడిపి పొత్తుల భాగంగా జనసేన పార్టీ మద్దతు కావాలని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగినది. ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచన మేరకు ఆత్మకూరు నియోజవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు & ఆత్మకూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్, సంగం మండల జనసేన పార్టీ నాయకులు మరియు సంఘం మండల చిరంజీవి యువత అధ్యక్షులు పత్తిపాటి కృష్ణమోహన్, సంఘం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చల్ల రవిచంద్ర, సంఘం మండల జనసేన పార్టీ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సంగం మండల నాయకులను మరియు కార్యకర్తలను పవన్ కళ్యాణ్ అభిమానులను కలుపుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంఘం మండల నాయకులు యామల రాజా, జనసేన పార్టీ సంఘం మండల నాయకులు దొంతల హజరత్, సంఘం మండల జనసేన పార్టీ నాయకులు రాపిన అనిల్ కుమార్, సంగం మండల జనసేన పార్టీ నాయకులు గుంజి జయరాజ్ , సంగం మండల జనసేన పార్టీ నాయకులు చిరంజీవి,మోక్షత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com