
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు మూడవరోజు చేపడుతున్న కార్యక్రమములో వందల కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి పెన్నానది పై నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు వెంటనే నిర్మించి వంతెనను ప్రజా రవాణాకు వీలుగా పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావాలని ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆత్మకూరు మండల కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయాలను మరియు ఇండోర్ స్టేడియంను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ గృహ సముదాయాలను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని, పట్టణంలో దెబ్బతిన్న బైపాస్ రోడ్ ను వెంటనే మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పూసల నాగమల్లేశ్వరరావు మరియు స్థానిక జనసైనికులు తో కలిసి నలిశెట్టి శ్రీధర్ గారు పాల్గొనడం జరిగింది.