Logo
Date of Publish : 24 May 2022, 12:31 pm
Editor : Sake Naresh

త్రాగునీరు వాటర్ ట్యాంకు నిర్మించాలని ఆత్మకూరు జనసేన నాయకులు డిమాండ్

    ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు సంగం మండలంలోని దువ్వూరు గ్రామం నందు త్రాగు నీరు నిల్వ పరిచే సుమారు 3000 నుంచి 5000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్ ను నిర్మించాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. త్రాగు నీరు నిల్వ చేసే వాటర్ ట్యాంక్ లేకుండా ఉండటం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని జనసేన పార్టీ దృష్టికి రావడం జరిగింది. కరెంటు ఉంటేనే మోటార్ల సాయంతో పంచాయతీ కుళాయిల ద్వారా త్రాగునీరు గ్రామ ప్రజలకు అందుతాయి. ప్రస్తుతం ఉన్న ఈ Y.S.R.C.P ప్రభుత్వం లో కరెంటు కోతలు ఎక్కువగా ఉండడం వల్ల త్రాగు నీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ తాగునీరు సమస్య పోవాలంటే. "త్రాగునీరు వాటర్ ట్యాంక్ "ను నిర్మించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో ఈ సమస్యను తీర్చే దిశగా జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో దువ్వూరు గ్రామం జనసేన పార్టీ ఆరవ వార్డు నెంబర్ ఆకులేటి సుధాకర్, సంఘం మండల నాయకులు మల్లికార్జున్, సతీష్, శ్రీకాంత్, లింకులు, మస్తాన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com