ఆత్మకూరు, (జనస్వరం) : సంగం మండలం దువ్వూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఆత్మకూరు జనసేన నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వాల్టా నిబంధనలను తుంగలో తొక్కి నదీగర్భంలో యంత్ర పరికరాలను ఉపయోగిస్తూ అక్రమంగా ఇసుకను గత రెండు నెలలుగా తరలిస్తున్నారన్నారు. సుమారు 45 టన్నుల భారీ వాహనాలతో ఇసుకను తరలించడం కారణంగా దువ్వూరు గ్రామంలో స్థానికంగా ఉన్న రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయమై ప్రయాణానికి దుర్భరంగా తయారయ్యాయి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రోడ్లకు మరమ్మతులు చేయాలన్న అనే స్పృహనే మరిచిపోయారు. దీనికి తోడు అంతంతమాత్రంగా ఉన్న ఈ రోడ్లపై భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లన్నీ పూర్తిగా చిద్రమైనాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే ఈ ఇసుక అక్రమ తరలింపును ఆపాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజవర్గ జనసేనపార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, బిజెపి సంఘం మండల నాయకులు కొండారెడ్డి, తిరుమలేష్, సతీష్, పార్వతీష్, కోళ్ల సాయి, శ్రీహరి, సుధాకర్, ప్రవీణ్, శ్రీకాంత్, భాను తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com