Logo
Date of Publish : 13 May 2022, 4:48 pm
Editor : Sake Naresh

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

     ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, జనసైనికులతో కలిసి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి, వేరుశనగ, పత్తి పంటలకు మరియు ఆక్వా రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందని, వెంటనే అధికారులు స్పందించి నష్టాలను అంచనా వేసి, నష్టపరిహారం ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా గత మూడు సంవత్సరాలుగా వచ్చిన వరదల కారణంగా మరియు గతంలో నివార్, ప్రస్తుత అశని తుఫానుల కారణంగా గత మూడు సంవత్సరాల నుండి రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారని, ఇది రైతులను ఆర్థికంగా కోలుకొని దెబ్బతీసిందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల నుండి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని, ఈ సంవత్సరమైనా దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com