ఆత్మకూరు, ఏప్రిల్ 07 (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సమీక్షంలో చేతుల మీద ఆత్మకూరు నియోజవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు & ఆత్మకూరు నియోజవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలంలోని ఓడ్ హౌస్ పేట, సంగం, గాంధీ జనసంఘం, కోలగట్ల, మ(రిపాడు పలు గ్రామాలలో నుంచి 50 మంది జనసేన పార్టీలోకి చేరడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు సంగం మండలంలో గత ఐదు సంవత్సరాల నుంచి దాడి భాను కిరణ్ నాయకత్వంలో సంగం జనసేన పార్టీ సీనియర్ నాయకులను మరియు కార్యకర్తలను పవన్ కళ్యాణ్ అభిమానులను కలుపుకొని అనేక కార్యక్రమాలు, సంఘం మండల జనసేన పార్టీలో చేరికలు, మూడు విడతల్లో గాను ఆత్మకూరు నియోజవర్గం మొత్తం మీద సంగం మండలంలో గాను ఎక్కువ క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వ్యక్తి దాడి భాను కిరణ్ మాత్రమే అని తెలిపారు. సంగం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలసమస్యల పట్ల పోరాటాలు, అక్రమ ఇసుక రవాణా మీద పోరాటాలు, సంగం మండలంలోని అన్ని గ్రామా పంచాయతీలో విడతల వారీగా నిరుపేద కుటుంబాలకు నిత్య సరుకులు పంపిణీ మరియు పార్టీ కార్యక్రమాలు జండా ఆవిష్కరణ, సంఘం మండల పరిధిలో చలివేంద్రo, మరెన్నో సేవా కార్యక్రమాలు సంఘం మండల పరిధిలో చేయడం ద్వారా చేసిన కార్యక్రమాలను గుర్తుపెట్టుకొని పలు గ్రామాల నుంచి దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో 50 మంది జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ చేతుల మీద పార్టీ కండువాలు, జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగిందన్నారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన, టిడిపి,బిజెపి పొత్తులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని మరియు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంఘం మండల ఉపాధ్యక్షులు చల్లా రవిచంద్ర, జనసేన పార్టీ సంఘం మండల సీనియర్ నాయకులు & సంగం మండల చిరంజీవి యువత అధ్యక్షులు అత్తిపాటి కృష్ణ మోహన్, సంగం జనసేన పార్టీ సీనియర్ నాయకులు యమల రాజా, సంగం జనసేన పార్టీ సీనియర్ నాయకులు గురువరాజు, జనసేన పార్టీ సంఘం మండల కార్యదర్శి హజరత్, జనసేన పార్టీ సంఘం మండల నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.