Logo
Date of Publish : 06 August 2021, 5:58 pm
Editor : Sake Naresh

వర్షాలు కారణంగా దెబ్బ తిన్న సోమశిల జలాశయ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

         ఆత్మకూరు,  (జనస్వరం) :  ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్  గారు స్థానిక జనసైనికులుతో కలిసి గత సంవత్సరం వరదల కారణంగా దెబ్బతిన్న, సోమశిల జలాశయానికి చెందిన ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ప్రజల పాలిట ఆధునిక దేవాలయం మన సోమశిల జలాశయం. నెల్లూరు జిల్లాలోని అన్ని జలాశయాలతో కలిపి సుమారు 180 టీఎంసీల నీటి నిల్వ కు కారణమైన జలాశయం ఇది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రైతాంగం యొక్క సాగు, తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజానీకం యొక్క తాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్న, వరప్రదాయిని ఈ జలాశయం. ఇంతటి ప్రాముఖ్యత గల, ఈ అంతర్రాష్ట్ర జలాశయం ముందు భాగం గత సంవత్సరము వచ్చిన వరదల కారణంగా పూర్తిగా దెబ్బ తినడం జరిగింది. జనవరిలో సోమశిల జలాశయానికి సాంకేతిక కమిటీ పరిశీలించి, ఆగష్టు లోపల పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది, కానీ పాలకుల అసమర్థత, అలసత్వం కారణంగా జలాశయం యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల నిర్లక్ష్యానికి రెండు రోజుల క్రితం పులిచింతల గేట్లు తెగి జీవజలములు వృథాగా సముద్రం పాలుకావడం మాత్రమే కాకుండా, తీవ్రమైన నష్టం జరిగిన విషయం తెలిసినదే. గత వరదల కారణంగా సోమశిల ముందుభాగంలో ఏర్పడిన షుమారు 30 అడుగుల లోతు గుంటలు ఏర్పడ్డాయి. వీటి కారణంగా సోమశిల ప్రధాన కట్టడానికి పెను ప్రమాదం పొంచి ఉంది. వెంటనే పాలకులు తమ అలసత్వాన్ని వీడి మరమ్మతులను చేయని పక్షంలో, సోమశిల జలాశయం దిగువున అన్ని గ్రామాల ప్రజలకు పెను ముప్పు పొంచి ఉంది. ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితమే ప్రభుత్వాన్ని ఈ విషయమై హెచ్చరించడం జరిగింది. ఈ రోజు సోమశిల జలాశయం 75% నీటితో నిండినది. మరి కొద్ది రోజుల్లోనే జలాశయం నిండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం తమ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే మరమత్తులు పూర్తి చేయాలని, జలాశయానికి రాబోయే పెను ముప్పు నుండి కాపాడాలని, జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమములో జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com