ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, స్థానిక జనసైనికులుతో కలిసి 5వ రోజు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగం మండలం, కోలగట్ల గ్రామం లోని, హరిజనవాడను సందర్శించి ఆహార పొట్లాలను పంచడం జరిగింది. హరిజనవాడలోని సుమారు వంద కుటుంబాల్లో మూడడుగుల లోతు, వరదల కారణంగా ఏర్పడిన బురదతో నిండి పోయి ఉన్నాయి. ఈ కాలనీవాసుల కష్టాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పుస్తెలతాడు తాకట్టులో పెట్టి అప్పులు తీసుకొచ్చి మరీ, సాగు చేసిన ఒక ఎకరా, అర ఎకరాకు సంబంధించిన దళిత కుటుంబాలు, పంటలు పూర్తిగా నష్టపోయి అయోమయ స్థితిలో ఉన్నాయి. మరియు ఈ ప్రాంతంలో సాగులో ఉన్న చేపల చెరువులు కట్టలు తెగిపోయి, అపారమైన ఆర్థిక నష్టం అన్నదాతలకు జరిగింది. పెన్నానది ఆకస్మిక వరద కారణంగా, ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, ఆత్మకూరు, సంగం, చేజర్ల మండలంలోని సుమారు 70 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు పంట నష్టాలను అంచనావేసి, నష్టపోయిన ప్రతి అన్నదాతకు తగిన ఆర్థిక సహాయం అందించాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com