ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో స్థానిక జనసైనికులు, రైతు సోదరులతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ అనంతసాగరం మండలం మంగుపల్లి గ్రామంలో ముంపుకు గురైన పంట పొలాలను సందర్శించడం జరిగింది. సోమశిల వరద తగ్గినప్పటికీ, అనంతసాగరం మండలంలోని గోవిందంపల్లి, పాతాళ పల్లి, మంగుపల్లి, గౌరవరం, ముస్తాపురం, కామిరెడ్డిపాడు, చిలకలమర్రి గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల ఎకరాల పొలాలు ఇప్పటికీ ముంపులోనే ఉండడం ఎంతో శోచనీయం. ఆ గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడగా, ఎప్పుడూ మా పొలాలు ఇటువంటి ముంపునకు గురి కాలేదని పేర్కొనడం జరిగింది. ఈ ముంపుకు కారణం ఇటీవల అనంతసాగరం అలుగుకట్ట ఎత్తు పెంచడమేనని రైతులందరూ ముక్తకంఠంతో పేర్కొనడం జరిగింది. అనంతసాగరం చెరువు అలుగు కట్ట ఎత్తు పెంచడం వల్ల ముక్కాలు టిఎంసి కెపాసిటీ కలిగిన చెరువులో మూడు, నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసే వీలు కల్పించడం జరిగింది. అనంతసాగరం చెరువు కెపాసిటీకి మించి నీరు నిల్వ చేయడం వలన ఈ నీరంతా కేతామన్నేరు వాగులోనికి చేరి తద్వారా ఈ ఏడు గ్రామాలకు చెందిన పొలాల్లోకి చేరడం జరిగింది. ఇప్పటికైనా అటు కలెక్టర్ గారు గానీ లేదా ఇరిగేషన్ అధికారులు గానీ రీ సర్వే జరిపించి వాస్తవాలను తెలుసుకొని, 7 గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాల పొలాలు ముంపునకు గురికాకుండా అనంతసాగరం చెరువు యొక్క అలుగు కట్ట ఎత్తు తగ్గించాలని స్థానిక రైతాంగం తరఫున జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో రైతులతో కలిసి న్యాయపరమైన పోరాటానికి, వీధి పోరాటానికి, జనసేన పార్టీ సిద్ధమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com