ముంపునకు గురైన వరి పొలాలను సందర్శించిన ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్
ఈరోజు స్థానిక రైతులు మరియు జనసైనికులతో కలసి ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్న ప్రస్తుత పరిస్థితులలో పెన్నా నదికి ఎంత వరద రాబోతుందో, పది రోజుల ముందుగా తెలుసుకునే పరిస్థితి ఉన్నది. రాబోయే వరదను ముందుగా అంచనా వేసి నష్ట నివారణ చర్యలను తీసుకొనవలసిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న కారణంగా, ఈ రోజు నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సమస్తం, నీటిలో మునిగి రైతుకు కన్నీళ్లే మిగిల్చింది. నియోజకవర్గంలో పెన్నా నది పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, సంగం, చేజర్ల మండలాలలో వరి, వేరుశనగ, పత్తి మరియు ఆక్వా రైతులు వరద కారణంగా పూర్తిగా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సర్వే జరిపి, నష్టపోయిన రైతాంగానికి పంటను బట్టి, ఎకరానికి పాతిక వేల నుండి 50 వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించవలసినదిగా, జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు షేక్ మస్తాన్ భాష, అన్నవరపు శ్రీనివాసులు, పవన్, చిన్నా జనసేన ఉదయ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.