Logo
Date of Publish : 03 July 2026, 8:52 pm
Editor : Sake Naresh

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా అబ్జర్వర్ గా అట్లూరి బాలశేఖర్.

HRCI సౌత్ ఇండియా జనరల్ బాడీ కమిటీ అబ్జర్వర్‌గా అట్లూరి బాలశేఖర్.

విజయవాడ,జూలై 03( జనస్వరం)

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులుగా సేవలందిస్తున్న అట్లూరి బాలశేఖర్ కి సంస్థ ఉన్నత పదోన్నతి (Promotion) కల్పించింది. అట్లూరి బాలశేఖర్ గత కొంతకాలంగా సంస్థ బలోపేతానికి, మానవ హక్కుల పరిరక్షణకు అందిస్తున్న విశేష సేవలను, వారి నిబద్ధతను పరిగణన లోకి తీసుకుని జాతీయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వారి పనితీరును గుర్తిస్తూ, ప్రస్తుత బాధ్యతల నుండి వారికి ప్రమోషన్ కల్పిస్తూ "సౌత్ ఇండియా జనరల్ బాడీ కమిటీ అబ్జర్వర్" (South India General Body Committee Observer) గా నియమించడం జరిగింది. ఇకపై వారు దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీల సమన్వయకర్తగా, పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కమిటీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు సాధారణ సభ్యులు ఈ మార్పును గమనించవలసిందిగా కోరుచున్నాము. అందరూ నూతన అబ్జర్వర్ కి పూర్తి సహకారం అందిస్తూ, సంస్థ ఆశయాల సాధనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.సంస్థ బలోపేతానికి బాలశేఖర్ మరింతగా తోడ్పడతారని, వారి నాయకత్వంలో దక్షిణ భారత కమిటీలు మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు చేపడతాయని ఆశిస్తూ, జాతీయ కమిటీ తరపున వారికి హృదయపూర్వక అభినందనలు.ఈ విషయాన్ని ఎల్. ముత్యాల బాబు
నేషనల్ జనరల్ సెక్రటరీ, క్రమశిక్షణ కమిటీ మెంబర్,హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) పత్రిక ముఖంగా తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com