
రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ సహకారంతో సుండుపల్లి మండల కురవ సంఘం అధ్యక్షులు జయరాం ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల నాయకులు జగిలి ఓబులేష్ అధ్యక్షతన టి, సుండుపల్లి మండలంలో కురువ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పాల్గొన్నారు. బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ గారు వారి కష్టాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దినేష్ మాట్లాడుతూ నేను సిద్ధం అంటున్న జగన్ మీ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని బీసీ సంక్షేమం కోసం ఏనాడైనా ఆలోచించారా అని అన్నారు. బీసీ లోని అన్యాయం చేసిన చరిత్ర నీది అన్న విషయం గుర్తు పెట్టుకో జగన్ నిన్ను రాజంపేట ఎమ్మెల్యేని ఇంటికి సాగనంపడానికి రాజంపేట నియోజకవర్గ బీసీలు మరియు ప్రజలు కూడా మేము సిద్ధం అంటున్నారు అని అన్నారు. కురవ సంఘాలకు బీసీలోని అన్ని ఉపకులాల వారికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని వారి సమస్యలను అన్ని విధాలుగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.