మహిళా సాధికారిత పోస్టర్లు ఆవిష్కరించిన అతికారి దినేష్

     రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ బుధవారం పట్టణ పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా సాధికారత, ప్రతి రైతన్న కు కొండంత భరోసా మరియు భావితరాల భవిష్యత్ యువతి యువకులకు అండగా జనసేన పార్టీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రతి ఆడపడుచుకు అండగా ఉంటుందని తెలిపారు. భ్రూణ హత్యలు నిషేధించి బాలిక విద్యను ప్రోత్సహించాలని, స్త్రీ చదువుకుంటే కుటుంబానికి వెలుగునిస్తుందని తెలిపారు. భావితరాల భవిష్యత్తు యువతి, యువకుల చేతుల్లో ఉందని.. వారికి నాణ్యమైన విద్యా బోధనలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సాహం అందిచ్చి యువతి యువకులకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఆ విధంగా చిన్నతనం నుంచే మహిళల పట్ల గౌరవ మర్యాదలు కలిగేటట్లు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలని సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేవిధంగా దేశంలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే ప్రతి రైతన్నకు కొండంత భరోసా జనసేన పార్టీ నిలుస్తుందని రాష్ట్రంలో పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి నష్టం వచ్చి అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను సొంత నిధులతో మూడు వేల మంది రైతు కుటుంబాలను కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. అటువంటి వ్యక్తిని ఆదరించాలన్నారు. అన్నం పెట్టే రైతన్నను, మహిళామూర్తులను దైవ సమానులుగా చూడాలని అనేక వేదికలుగా పలుమార్లు ప్రస్తావించడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుందని ఇటువంటి విషయాలను ప్రజలు గ్రహించి ఆయనకు మద్దతుగా నిలవాలని తెలిపారు. జనసేనాని బాటలోనే జనసైనికులు కూడా నడుచుకుంటూ మహిళలు, వృద్ధులు, పేదల పట్ల కరుణా భావంతో మెలగాలని సూచించారు. జనసేన, టిడిపి కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రణాళిక అబద్ధం గా ముందుకు వెళ్లడం జరుగుతుందని జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ పోస్టర్లను రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అంటించడం జరుగుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్, లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు కొట్టే శ్రీహరి, కొండలగారి రవి, కొట్టే హరీష్, రత్నం, మస్తాన్, మల్లెల హరిష్, శివ, సునిల్ గౌడ, పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way