రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట వినాయక నగర్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు పచ్చకర్ల బుజ్జి వృత్తిరిత ఆటో డ్రైవర్ గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించడం జరిగింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లు బాగాలేవు అన్న విషయం తెలుసుకున్న రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్. ఆయన వారి నివాసనికి వెళ్ళి అతని కుటుంబాని పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. జనసేన క్రియశీలక సభ్యుడు పచ్చకర్ల బుజ్జి గారికి కుటుంబానికి ఎప్పుడు ఏం అవసరమొచ్చినా అండగా ఉంటామని అన్ని విధాల ఆదుకుంటామని అతని కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, రెడ్డిరాణి, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీను, శంకరయ్య, బాలసాయి, గుగ్గిళ్ళ నాగార్జున, జయరాం చిన్నారి, రవి, హేమంత్, తదితరులు పాల్గోన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com