
రాజంపేట ( జనస్వరం ) : కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య జనసేన పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థుల ఆశావాహుల లిస్ట్ ను విడుదల చేసారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ పేరు జనసేన పార్టీ తరుపున పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గ జనసైనికులు హర్షం వ్యక్తం చేసారు. ఉన్నత విద్య చదువుకొని, చిన్న వయసులోనే రాజకీయాల్లో రాణిస్తున్న అతికారి దినేష్ వైసీపీ పార్టీని ధీటుగా ఎదుర్కోగలరని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు కుటుంబ రాజకీయ నేపథ్యం కలిగి ఉండటం, నియోజకవర్గ సమస్యల మీద పట్టు, వాటికి పరిష్కార దిశగా ఆలోచించే తత్వం ఉన్న నాయకుడని చర్చిస్తున్నారు. జనసేన అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే సునాయాసంగా గెలుస్తారని జనసైనికులు అంచనా వేస్తున్నారు.