రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతున్న ప్రజాబలంతో జనసైనికుల ఐక్యతపరుస్తూ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ రోజూ రోజూకి బలపడుతున్నారు. రాజంపేట నియోజవర్గం వీరబల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులతో ఆయన మాట్లాడుతూ వైసిపి తట్టా బుట్టా సర్దుకుని దిగిపోవడానికి సిద్ధం, మనం వైసిపి నాయకులను ఇంటికి సాగనంపడానికి సంసిద్ధం అని అన్నారు. అసమర్ధ రాక్షస పాలనతో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిగిపోవడానికి సిద్ధం జనం మెచ్చే జనం కోరే జనసేన టిడిపి అధికారం అధికారంలోకి రావడానికి సంసిద్ధం అన్నారు. ఈ ఎన్నికలలో నియోజవర్గ వ్యాప్తంగా ఓడిపోవడానికి దిగిపోవడానికి వైసిపి నాయకులు కార్యకర్తలు సిద్ధం, గెలుపే లక్ష్యంగా పవనన్న మాటే శిరోధారంగా జన సైనికులంతా ఐక్యతతో సంసిద్ధం అంటూ తన ప్రసంగంతో జనసేన నాయకులు మరియు జన సైనికులకు దిశా నిర్దేశం చేసి వారిని ఉత్తేజ పరిచారు. కొండంత ధైర్యంతో ముందుకు వెళ్లాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com