Logo
Date of Publish : 25 December 2023, 11:13 pm
Editor : Sake Naresh

కొండలపై అక్రమ తవ్వకాలు వెంటనే ఆపేయాలని అతికారి దినేష్ డిమాండ్

    రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట మండలం బాలరాజు పల్లె గ్రామంలో ఇసుక రీచులలో రోడ్డుల కోసం ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు అక్రమంగా కొండలు తవ్వుతున్నారని రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ తవ్విన గ్రావెల్ ను ఇసుక రీచుల కోసం రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ ఇసుకను దళారుల చేత అక్రమంగా రవాణా చేయించడం తగదని ఆ విధంగా వైసీపీ పార్టీ నాయకులు అక్రమంగా కొండ తవ్వకాలు అక్రమ ఇసుక రవాణా వంటి చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యకలాపాలు చూస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకోవడం శోచనీయమని అన్నారు. ఒక సామాన్యుడికి ఒక ట్రాక్టర్ గ్రావెల్ కావాలన్నా ఇసుక తీసుకువెళ్లాలన్నా పలు షరతులు విధించి పలు కండిషన్ లు పెట్టే ప్రభుత్వ అధికారులు ఈ వైసీపీ అరాచక శక్తులు చేస్తున్నటువంటి అక్రమాల పైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో చట్టాలు బలహీనుడికి బలంగానూ, బలవంతుడికి బలహీనంగాను పని చేస్తున్నాయని ఎద్దేవా చేశారు... దోచుకోవడం, దాచుకోవడమే పరామవధిగా సామాన్యుడిని ఈ వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని తక్షణమే ఈ అక్రమాలను ఆపాలని లేని పక్షంలో రోడ్డులెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగిలి ఓబులేష్, గుగ్గిళ్ళ నాగార్జున, వెంకటేష్, గోపికృష్ణ, హేమంత్, ఆనంద్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com