నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ సర్కిల్ నందు గల రోటరీ క్లబ్ నందు మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు కొత్తగా ఓటర్లు నమోదు చేయించుకోవాల్సిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసిపి నాయకులు మాట్లాడుతూ జనసేన మద్దతుదారులందరూ అభిమానులు కానీ ఓటు వేసేవారు కాదని ఎద్దేవా చేస్తుంటారు అది నిజం కాదని నిరూపిస్తూ ఈ రోజున కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పాతిక సంవత్సరాలు బిడ్డల బంగారు భవిత కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి యువతరం మద్దతు ఉంది వేసే ఓట్ల నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో పనిచేసేందుకు సంసిద్ధంగా ఉండాలని తెలియజేసే కార్యక్రమం ఇది. కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న యువత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నారంటూ తెలిపే కార్యక్రమంలో భాగంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే హష్టాగ్ ఉపయోగించుకొని సామాజికమద్యాల్లో ప్రచురించాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైనా కానీ మేము అందరం కళ్యాణ్ గారి వెంటనే నడిచి నవ సమాజ స్థాపనకు పోరాడుతాం.
నెల్లూరులో నిత్యం పంచులు వేసే బంగారు రాజుగారు అనిల్ గారు మాట్లాడుతూ బంగాళాఖాతంలో కలిపేయాలని అన్నారు… గత ఎన్నికల్లో అంత హవా ఉన్న రోజుల్లోనే మీరు బోర్డర్ ఓట్ల తో బయటపడ్డారు అదే జనసేన తెలుగుదేశం కలిసి చేసి ఉంటే తమరు ఆ రోజు గెలిచి వారా.. ఆరు నెలలు ఆగితే ఓడిపోయిన మిమ్మల్ని పర్సంటా అర పర్సంటా అన్న పూర్తయిన కాని పోలవరం ప్రాజెక్టులో కలిపేయవలసి వస్తుంది. అరాచక పాలన సాగిస్తూ ప్రజలను అడ్డగోలుగా నియంత్రిస్తున్న వైసిపి ప్రభుత్వం కనిపించకుండా చేయాలన్న పవన్ కళ్యాణ్ గారి మాటకు బాసట గా నిలిచేందుకు జనసైనికులు అందరూ కూడా ఎన్నికలకు సిద్ధం చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. గత ఎనిమిది నెలలుగా జరిగిన ప్రజాప్రస్థానంలో మద్దతుగా నిలిచిన జన సైనికులకు, వీర మహిళకు పేరు మీద అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత గౌడ్, వీర మహిళలు కృష్ణవేణి, రేవతి, హైమావతి హేమచంద్ర యాదవ్, మౌనిష్, కేశవ, బాలు, తరుణ్, వర్షన్, శ్రీను, సాయి, షారూ, కాసిఫ్ తదితరులు పాల్గొన్నారు.