విజయనగరంలో బిజెపీ ~ జనసేన అభ్యర్థిపై హత్యాయత్నం దారుణం
జనస్వరం న్యూస్ : ఈ కరోనా విపత్కర సమయంలో తన డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను తన వంతు సామాజిక బాధ్యతగా చేయిస్తున్న విజయనగరానికి చెందిన బిజెపీ నాయకుడు శ్రీ కాళ్ల నారాయణ రావు పై అధికార పక్షం గూండాలు దాడి చేయడం దారుణం. శ్రీ నారాయణ రావు గారు విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ~ బిజెపీ అభ్యర్థిగా ఎన్నికల్లో ఉన్నాడు. తన డివిజిన్ పరిధిలో పారిశుధ్య పనులు సరిగ్గా లేవని, తానే పూనుకొని చేయిస్తుంటే వాలంటీర్ల ద్వారా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని తెలిసింది. తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయిస్తామని సంబధిత అధికారులకు తెలియజేసి పని చేయిస్తుంటే వైసీపీ గూండాలు అడ్డుకోవడం కాకుండా భౌతికంగా దాడి చేశారని, అలాగే తన ఇంటి సభ్యులా మీద కూడా దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే తక్షణమే రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని, జిల్లా ఎస్పీ గారు రంగంలోకి దిగి హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే అధికార పక్ష గూండాల దాడులపై రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా మంత్రి సమాధానం ఇవ్వాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు. విజయనగరం జిల్లాలోనే ఉన్నా పెదపెంకి గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది పారిశుధ్య పనులను విస్మరిస్తే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో. ఆ గ్రామంలో బోధకాలతో బాధపడుతున్నవారు అనేకమంది ఉన్నారని, మీరు ఎలాగూ చేయడం లేదని స్వచ్ఛందంగా వచ్చి చేసేవారిని అడ్డుకొని కత్తులతో దాడి చేయడం దారుణమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.