•ప్రతిభగల క్రీడాకారులను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తారు….
•భరత్ చంద్ర గారు మన దేశానికి మన రాష్ట్రానికి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టారు….
•భరత్ చంద్ర యువతుకు స్ఫూర్తిగా నిలిచారు: పెండ్యాల శ్రీలత…
అనంతపురం ( జనస్వరం ) : ఏషియన్ ఛాంపియన్ షిప్ జపాన్ నందు జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో మన దేశం నుండి ఆడి ప్రతిభ కనపరిచిన అనంతపురం జిల్లా వాసి భరత్ చంద్రకి జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి అభినందన సన్మాన సభను నిర్వహించి భరత్ చంద్రని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జపాన్ దేశం నందు జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో ప్రతిభ కనపరచి కాంస్య పతకం సాధించిన భరత్ చంద్రకి మా అభినందనలు తెలుపుతూ భరత్ చంద్ర గారు మన తెలుగు వ్యక్తి అయినందుకు మనమందరం గర్వపడాలని ఇతనొక సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కాంస్య పతకం సాధించి దేశంతో పాటు మన రాష్ట్రానికి కూడా ఖ్యాతిని తెచ్చాడని భరత్ చంద్రకి రాబోయే రోజుల్లో కూడా మన దేశం తరఫున ఆడి స్వర్ణ పథకాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రికి క్రీడాకారులు అంటే ఎంతో అభిమానం అని వారిలో ప్రతిభను గుర్తించి వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారని తెలియజేశారు. అనంతరం ఈ సమావేశంలో కాంస్య పతాక విజేత భరత్ చంద్ర మాట్లాడుతూ నేను ఈరోజు ఈస్థాయిలో ఉండడానికి కారణం మా నాన్నగారు శ్రీనివాసులు మరియు నా కోచ్ సి.వెంకటేశులు గారని యువత కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని అందుకు నేనే నిదర్శనం అని తెలుపుతూ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ శ్రీలతకి, జిల్లా నాయకులు పెండ్యాల హరికి జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవరాయుడు, చొప్ప చంద్రశేఖర్, అనంతపురం నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, రోళ్ళ భాస్కర్, కమతం వెంకటనారాయణ, కార్యదర్శులు కొత్తచెరువు నాగ విశ్వనాథ్, కుంకాల లాల్ స్వామి, వడ్డే సాయి సంపత్, సంయుక్త కార్యదర్శి ఆకుల అశోక్, ఆకుల ప్రసాద్, వల్లంశెట్టి వెంకటరమణ, మండల అధ్యక్షులు గంటా రామాంజనేయులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ జిల్లా సభ్యుడు సంతోష్ కుమార్, వీర మహిళలు కాశెట్టి సావిత్రి, గుమ్మడి సాని శిల్ప, కుళ్లాయమ్మ, వరలక్ష్మి, రమాదేవి, లక్ష్మి నాయకులు పెండ్యాల మహేష్, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, సాయి కుమార్,చంద్ర, శీన,హర్ష,హరికృష్ణ, ఉత్తేజ్,గంగాధర్ కాపు సంక్షేమ సేన జిల్లా కమిటీ సభ్యులు మరియు కాపూ నాడు జిల్లా అధ్యక్షులు పూల పాండు రంగయ్య గారు జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, రామాంజనేయులు, నాగేంద్రప్రసాద్, నాగభూషణం, ఈరన్న, సూర్యనారాయణ, రామాంజనేయులు, నాగసముద్రం నారాయణ, మల్లికార్జున తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.