Logo
Date of Publish : 26 December 2022, 3:37 pm
Editor : Sake Naresh

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా : సత్తెనపల్లి జనసేన నాయకులు

       సత్తెనపల్లి, (జనస్వరం) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన వర్థంతి వేడుకల్లో మొదటగా మాదల గ్రామం జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు పాల్గొని రంగా విగ్రహానికి నివాళ్లులర్పించి వారి ఆశయాలను జనసేన తో సాధ్యమని తెలియచేశారు. తదుపరి రుద్రవరం గ్రామం, బ్రుగభండ గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలో రంగా అబిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూల మాలలతో నివాళులర్పించి రంగా బలహీన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగం చరిత్ర ఎన్నటికీ మరువదని ఆయన ఆశయాలకై జనసేన పోరాడుతుందని కొనియాడారు. అనంతరం రాజుపాలెం మండలంలో రంగా అబిమానుల ఆహ్వానం మేరకు అబిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన త్యాగాలను, ధైర్య సాహసాలను ప్రత్యర్ధి పార్టీలపై ఆయన చేసిన పోరాటాలను కొనియాడుతూ రాజకీయాలలో ఆయన ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతకాలం చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేశారు. నకరికల్లు మండల కుంకులగుంట, చేజర్ల గ్రామాలలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రంగా గారు ఒక్క కులానికి మాత్రమే నాయకుడు కాదు అన్ని వర్గాల వారికి ఆయన ఒక స్పూర్తిదాయకం మరియు అన్ని వర్గాలవారి గుండెల్లో ఆయన స్థానం చిరస్మరణీయం అని, రంగా పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్, సత్తెనపల్లి రూరల్ మండలాధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, రాజుపాలెం మండలం అధ్యక్షులు తోట నరసయ్య, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, ముప్పల మండలం వైస్ ప్రెసిడెంట్, షేక్ గౌస్, రాజుపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్, బత్తుల హనుమంతరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నాగభూషణం, దూళిపాళ్ల మాజీ సర్పంచ్ చిలక సత్యం, షేక్ జాన్ పీరా, తూలవా సీతయ్య, కేదారి రమేష్ రామి శెట్టి సన్నీ, పసుపులేటి మురళి, ఛాతికిల ఏడుకొండలు, స్వరూపు, సైదా మస్తాన్, పెద్ద ఎత్తున జనసైనికులు కార్యకర్తలు పాల్గొని రంగాకి నివాళులర్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com