
శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జివినుత కోటా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏర్పేడు మండలంలోని పాతవీరాపురం గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు, జనసైనికులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఏర్పేడు మండల ఇంఛార్జి కిరణ్ రామిశెట్టి ఆధ్వర్యంలో వెంకటముని అధ్యక్షతన ఇంటింటికీ ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని కోరారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీలను ఇంటింటికీ వివరించడం జరిగింది. పథకాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి మండల నాయకులు వెంకటరమణ, సురేంద్ర, యువరాజ్, వంశీ మరియు పంచాయితీ నాయకులు ఉదయ్, నాగరాజు, శేషాద్రి, ప్రకాష్, సాయి, వెంకటముని మరియు జనసైనికులు పాల్గొన్నారు.