గుంతకల్ పట్టణం ( జనస్వరం ) : స్థానిక కసాపురం రోడ్డు, రామలింగ కాంప్లెక్స్ దగ్గర జనసేన పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన "మేము సిద్ధం" ఫ్లెక్సీని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కావాలని పని కట్టుకొని చించి వేశారని నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మా జనసేన పార్టీ లెక్కలోనే లేదన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీలకే ప్యాంట్లు తడుపుకుంటున్నారు. సంకరజాతి వెధవలు అని తీవ్రంగా అంటూ వాసగిరి మణికంఠ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండే గుంతకల్ నియోజకవర్గంలో ఇలా ఫ్లెక్సీలు చించి దుశ్చర్యకు పాల్పడడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. తక్షణం పోలీసు అధికారులు ఈ విషయం గురించి దర్యాప్తు చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com