
గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ పట్టణం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోని 5 నెలలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పైప్ లైన్ గుంతను పూడ్చాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సోఫియా కాలనీ ప్రజల మద్దతుతో నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు అయినా చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేయగా అధికారులు వెంటనే స్పందించి ప్రజా ఆరోగ్య శాఖ సిబ్బందితో వెంటనే ఆ ప్రాంతానికి జెసిబితో వచ్చి ప్రజలు నిత్యం తిరుగుతున్నటువంటి రహదారి మార్గాన్ని తాత్కాలికంగా తిరగడానికి బాగు చేయడం జరిగింది. అక్కడ నివాసమున్నటువంటి స్థానిక ప్రజలు జనసేన పార్టీ నాయకులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. మంచి పని చేశారు గత ఐదు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వినలేదు. మీరు అధికారంలో లేకున్నా అధికారులకు చురకులు అంటించి వారి బాధ్యతలను గుర్తు చేయడంతో వెంటనే తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారని ప్రజలు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు వాసగిరి మణికంఠ ప్రజలతో మాట్లాడుతూ మా నాయకుడు జనసేనాని ఒకటే చెప్పారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం దిశగా జనసేన పార్టీ ప్రజలకు నిత్యం అండగా ఉంటుందని ప్రజలు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అలాగే నీతి నిజాయితీ కలిగినటువంటి జనసేన పార్టీ యువ నాయకత్వానికి భవిష్యత్తులో అందరూ మద్దతుగా ఉండాలని కోరారు.