చిత్తూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల శంకర వానికి నాందిగా వారాహి వాహనంపై ప్రచారానికి శ్రీకారం చుట్టిన విష్యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట జనసైనికులు మెగా ఫ్యామిలీ అభిమానులు జేజేలు పలుకుతూ ఎదురుచూస్తున్నారని చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ బలోపేతం దిశగా ఎన్నికల దృష్టితో కాకుండా ఏడాది పొడవున జనసైనికుల సహకారంతో ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నామని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాలు, బూతు స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకోసం ఆయా స్థాయిలో నాయకులు పరస్పర సహకారాన్ని అందిస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు, జన సైనికులకు ఆయన ఆ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com