- ఐ ఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం శోచనీయం.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పై అణిచివేత ధోరణి అమలు చేస్తున్న ప్రభుత్వానికి తగిన శాస్తి జరుగుతుంది.
చిత్తూరు, (జనస్వరం) : ఫ్యాప్టో నేతల పిలుపుమేరకు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ముట్టడి కోసం బయలుదేరుతున్న చిత్తూరు జిల్లా ఎస్టియు జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని పీలేరు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మాట్లాడుతూ 2019 ఎన్నికలకు పూర్వం ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి 2004 అనంతరం ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు పరచకపోవడం చాలా బాధాకరం అన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇస్తున్నటువంటి 27 శాతం ఐఆర్ కంటే తక్కువగా పిఆర్సి 23 శాతం ఫిట్మెంట్ తో ప్రకటించడంతో పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను ఒకేసారి ప్రభుత్వం ప్రకటించి ఉద్యోగులను మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వాలు అమలుపరిచిన ఐ ఆర్ కంటే ఎక్కువ శాతం పిఆర్సి ఫిట్మెంట్ ఇవ్వడంతో ఉద్యోగుల జీత భత్యాలు పెరిగేవి అన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల్లో పెరగడం కంటే గతం కంటే తగ్గిపోతున్నాయి అన్నారు. గతంలో ఇస్తున్న హెచ్ ఆర్ ఎ ను సైతం తగ్గించడం ద్వారా ఉద్యోగుల మూల వేతనంలో కోత పడుతోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పి ఆర్ సి తమకు సమ్మతం కాదని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేస్తే అందుకూ ప్రభుత్వం సహకరించక రాత్రికి రాత్రే పిఆర్సి పట్ల చీకటి జీఓలను ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులపై అణచివేత చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వం పీఆర్సీపై పునరాలోచించాలని లేని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులకు అండగా జనసేన పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com