Logo
Date of Publish : 11 December 2023, 8:22 pm
Editor : Sake Naresh

నాదెండ్ల మనోహర్ అరెస్ట్ అప్రజాస్వామికం : ఏపీ శివయ్య

    చిత్తూరు ( జనస్వరం ) : మాజీ స్పీకర్ మరియు ప్రస్తుత జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టును ఖండించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య. ఆయన మాట్లాడుతూ వైజాగ్ లో టైకోన్ జంక్షన్ మూసివేయడంపై పీఏసీ చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతూ మరియు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా  నాయకుడైన నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం చూస్తే ప్రజాస్వామ్య విలువలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని విమర్శించారు. అదేవిధంగా ప్రతిపక్షాల గొంతును నొక్కా ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2024 సంవత్సరంలో జనసేన పార్టీ మరియు మిత్రపక్షాల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తద్యమని పేర్కొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com