● జనసేనపార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు, నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : దసరా ఉత్సవ ఏర్పాట్లను శనివారం జనసేనపార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు, నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దసరా ఉత్సవ ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. శాఖల మధ్య సమన్వయం లేదని ఎద్దేవా చేశారు. క్యూలైన్ల ఏర్పాటు కూడా ఇంతవరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు భోజన వసతి, లిఫ్ట్ సౌకర్యం కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖలకు చెందిన సిబ్బందికి రోజుకు 180 రూపాయలతో భోజనం ఏర్పాట్లు సామాన్య భక్తులకు 20 రూపాయలతో సాంబార్ అన్నం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కళా వేదిక ఇంతవరకు ఏర్పాటు చేయలేదని తెలియజేశారు. పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉందన్నారు. దుర్గా ఘాట్ లో జల్లు స్నానాలు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. దుర్గా ఘాట్ లో మహిళ భక్తులు బట్టలు మార్చుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు. అంతరాలయం బయట ఉచిత దర్శనం క్యూ లైన్ లో సామాన్య భక్తులకు ఉక్కపోత తప్పదు ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదని ఫ్యాన్లు సంఖ్య సరిపోదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు నారంశెట్టి కుర్మారావు, కరిమికొండ శివరామ కృష్ణా, బుద్ధన ప్రసాద్, రాళ్ల పూడి గోవింద్, పుల్లారావు, శానంపూడి శిరీష, రమాదేవి, ఉదయ లక్ష్మి, విజయలక్ష్మి, సుజాత రావు, కాంత కుమారి, విజయవాడ నగర అధికార ప్రతినిధి ముద్దాన స్టాలిన్ శంకర్, 37, 38, 53 డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీల కరుణాకర్, సిగనంశెట్టి రాము, పొట్నూరి శ్రీనివాస్, విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్, జనసేన పార్టీ నాయకులు నామాల కార్తీక్, నోటచర్ల పవన్ కళ్యాణ్, తమ్మిన అరవింద్, సోమీ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com