పిఠాపురం ( జనస్వరం ) : చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పైగా పార్టీలోకి చేరారు. తొలుత చిత్రాడ గ్రామ మహాలక్ష్మి గుడి వద్ద అమ్మవారిని దర్శించి అనంతరం అక్కడ నుండి ఈబిసి కాలనీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఉదయ్ శ్రీనివాస్ ని ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో భాగంగా మహిళలు దారిపొడుగునా హారతులు పట్టారు. అనంతరం ఈబిసి కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వైఎ్సార్సీపీకి చెందిన నాయకులు కేశరపు నూకరాజు , తేలు అర్జున్ రావు, మొగిలి శ్రీనివాస్, కంద సత్యనారాయణ , మల్లిపాము తాతీలు,పిల్లి శ్రీనివాస్, వారి అనుచరులు నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేదని, అంగన్వాడీలకు మొండి చేయి చూపారని, అవినీతి పెరిగిపోయిందని, రోడ్లు ధ్వంసం అయ్యాయని, పదకొండున్నర లక్షల కోట్లు అప్పుచేశారని, ఆంధ్ర ఆదాయం వడ్డీలకు కట్టడానికి సరిపోతుందని, మీ ఆస్తిపై జగన్ ఫొటో పెట్టుకోవడం దౌర్భాగ్యం అన్నారు. ఉద్యోగులను నానా అవస్థలకు ఈ ప్రభుత్వం గురిచేస్తుందన్నారు. అందరం మూడు నెలలు కష్టపడితే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు తంగెళ్ళ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, జనసేన చిత్రాడ ఎంపిటిసి దూలపల్లి రత్నం, దేశిరెడ్డి సతీష్, తేలు శ్రీనివాస్, శిగటాపు నారాయణరావు, పెంకే జగదీష్, తేలు దొరబాబు, బస్వా కృష్ణ, కోటిపల్లి గోపి, నిమ్మన దుర్గబాబు,బస్వా కృష్ణ, నంద్యాల జాన్, బావిశెట్టి నందు, కేశరపు శివ శంకర్, వెంకటేష్, తేలు సుబ్బు, నాయుడు మణికంఠ, కొప్పాల గణేష్, కొట్టేల పండు, బస్వా గణేష్, కేశరపు పవన్, గోపు సురేష్, పి.ఎస్.ఎన్ మూర్తి,పిండి శ్రీను, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు వీర మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com