బొబ్బిలి ( జనస్వరం ) : ఆరికతోట గ్రామం జనసేన పార్టీ యువ నాయకులు కనకాల శ్యామ్, అల్లు రమేష్ మరియు గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ కలయకకి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబాబు పాలూరు మాట్లాడుతూ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా క్షేత్ర స్థాయిలో పని చేసి బ్రిటీష్ పాలన చేస్తున్న ఈ వైసిపి పార్టీని సమూలంగా భూస్థాపితం చెయ్యాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ మరియు చంద్రబాబు నాయకత్వంలో 2024 నుంచి మన రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని.. రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య వైద్యం, మహిళల సాధికారతే లక్ష్యంగా రానున్న మన జనసేన-తేదేపా ప్రభుత్వం పని చేస్తుందని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెలుగుదేశం నాయకులు భాస్కరరావు, వెంకట్రావు, జనసేన నాయకులు బెవర గణేష్, చీమల సతీష్, ఎందువ సత్య, పల్లెం రాజా, తిరుమలరావు, జగన్నాధం, ఆరికతోట మరియు బూసాయివలస జనసైనికులు మరియు ఆరికతోట గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com