ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస TO శ్రీకాకుళం రోడ్ల కొరకు మానవహారం చేస్తూ నిరసన తెలిపిన ఆమదాలవలస నియోకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రహదారిపై రోజుకు కొన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అయినా ఒక పక్క ఆమదాలవలస నియోజవర్గంలో (సభాపతి) తమ్మినేని సీతారాం గారు మరో వైపు శ్రీకాకుళంలో (క్యాబినెట్ రెవెన్యూ మంత్రి )ధర్మాన ప్రసాదరావు గారు పజలు సమస్యలు పట్టించుకోలేదని వాపోయారు. దీనికి కారణం కూడా గుత్తేదారులు దగ్గర కమిషన్ ఆశిస్తున్నారు అని సమాచారం. ఇవి అన్ని పక్క పెట్టీ మీరు వెంటనే వారం రోజుల్లో రోడ్డులు పనులు మొదలు పెట్టకపోతే ప్రజలు అందరి తరుపున జనసేన పార్టీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడనని అన్నారు. రోజు 10 నుంచి 15 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే గర్భిణీ స్త్రీలు, ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారని తొందరగా పనులు మొదలు పెట్టాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్, గణేష్, కోటేష్, ధనుంజేయ రావు, బాలకృష్ణ, యశ్వంత్, తవిటినాయుడు, రాధాకృష్ణ, శ్రీధర్, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.