Search
Close this search box.
Search
Close this search box.

కలిస్తేనే కలవరమా… వారాహిపై వస్తే ఏమవుతారో ??? : జనసేన నాయకులు భవానీ రవి శంకర్

భవానీ రవి శంకర్

            అనంతపురం ( జనస్వరం ) :  కుప్పంలో జరిగిన సంఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సాధారణంగా కలిస్తేనే వైసీపీలో కలవరం మొదలైంది. ఇక వారాహిపై పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర పర్యటన చేస్తే ఏమవుతారో మీ దుర్మార్గపు పాలనకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని జనసేన కార్యనిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్‌ అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ పై వైసిపి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ… రాజకీయాలలో ప్రతిపక్ష నేతలు కలిసి జనసేన కార్యనిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్‌ మాట్లాడితే తప్పు అన్నట్టుగా వైసిపి కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేయడం వారి అభద్రత భావానికి నిదర్శనం అన్నారు. వైసిపి మంత్రులు వారి వారి శాఖలపై దృష్టి సారించకుండా… ప్రజా సమన్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేసి… కేవలం వవన్‌ కళ్యాణ్‌ ను విమర్శించడమే లక్ష్యంగా పనిచేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అన్నారు. ప్రజా వ్యతిరేకతను. తాళలేక ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని తీసుకొచ్చిన జీవో నెంబర్‌ ఒకటి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తామంటే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సారథ్యంలో మీ భరతం పడతామని భవాని రవికుమార్‌ అల్టిమేటం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way