ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి మీద వైసీపీ నాయకులు చర్చకు సిద్ధమా

     రైల్వేకోడూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యలయంలో జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతు సాక్షాత్తు సీఎం తో సహా మంత్రి, విప్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మెన్లు ఎవరైనా ఉమ్మడి కడప జిల్లా 10 నియోజక వర్గాలలో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.. మీకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి మీద శ్వేత పత్రము వదలాలని కోరారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడికడపజిల్లాలో ఇసుక, మట్టి, దోపిడీ తప్ప అభివృద్ధిలో ఐరవై సంవత్సరాలు వెనక్కి నెట్టారని ఏద్దేవా చేశారు.. పారిశ్రామికంగా హామీలిచ్చిన సీఎం రైల్వే కోడూరు అప్స జ్యుస్ ఫ్యాక్టరీ మొదలు నందలూరు లోకోషెడ్, ఆల్విన్, చెన్నూరు చక్కర కర్మాగారం, ఉక్కు కర్మాగారం మాటలు తప్ప కనీసం వీటివైపు కన్నెత్తి చూడలేదు. స్వార్థ ప్రయోజనాలకు రాజంపేట కాపీటల్ రాయచోటికి మార్చి రాజంపేటను నిర్వీర్యం చేశారు. అన్నమయ్య డాం బాదితుల గోడు వినేనాదుడే లేడు జిల్లా స్థాయిలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కన్నీటితో ఉన్నారు. యస్సీ, ఎస్టీ బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్లు ద్వారా ఎవరికీ ఎంత లబ్ది చేకూర్చారో చెప్పే ధైర్యం ఉందా? ఉమ్మడి జిల్లాలో ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు చూపగలరా? అని నీలాదీశారు ప్రజలు మీకెందుకు ఓటు వేయాలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఒక్క పని చేయని మీరు ఓటు అడిగే హక్కు కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వరికూటి నాగరాజ, దాసరి వీరేంద్ర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way