అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 47వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 27వ డివిజన్ పర్యటించి స్థానిక మహిళలతో మమేకమై నివిజన్ సమస్యలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలన కాలంలో పోలిస్ వ్యవస్త జగన్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తూ వైకాపా కి బీ టీమ్ గా వ్యవహరిస్తుందని అందుకు నిదర్శనమే నీన్నటిరోజు అర్ధరాత్రి జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది జనసేన మీడియా సిబ్బంది నివసించే గదులలోకి వెళ్లి అక్కడ ఉన్న వాచ్ మెన్ ను పోలీస్ లు గన్నుతో బెదిరించి అందరినీ బ్రయాబ్రంతులకు గురిచేసి వారి గదులలోకి వెళ్లి ఎటువంటి ఆధారాలు చూపకుండా తనిఖీలు చేయడం ఎంతవరకు సబబు కాదని ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మనం ప్రజా స్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నమే అర్థం కావడం లేదని పోలీసులు వైకాపా నాయకులకు కొమ్ము కాస్తూ వారు చెప్పినట్లు వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పోలిస్ యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి. ఈ సమస్య నిన్న ఒక్కటిదే కాదు రాష్ర్టంలో మొత్తం ఎక్కడచుసిన పోలీస్ వ్యవస్త వైకాపాను అనుకరిస్తూ పనిచేస్తుంది ఈ విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ నాయకుడు తాతయ్య , నగర ప్రధాన కార్యదర్షి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com