APPSC ద్వారా గ్రూప్ -1 గ్రూప్ -2 లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులేనా అని శాఖల వారీగా ఉన్న ఖాళీలను పారదర్శకంగా గుర్తించి వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలనీ జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏ.పి.పి.ఎస్. సి ద్వారా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి రాగానే రెండేళ్ల తర్వాత మాట మార్చి మడమ తిప్పింది జాబ్ క్యాలెండరు కోసం పలు ముహుర్తాలు మార్చి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు ప్రతి యేటా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అని ఎన్నో తేదీలు మార్చారు చివరకు తూ.. తూ మంత్రం గా క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను నిరాశపరిచారు. లక్షల ఉద్యోగాలిస్తాం అని మేనిఫెస్టోలో చెప్పిన ప్రభుత్వం చివరికి ఏ.పి. పి. ఎస్. సి ద్వారా గ్రూప్ -1,గ్రూప్ -2 లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి అని చూపించడం బాధాకరం అని అన్నారు. హామీ లక్షల్లో ఇచ్చి భర్తీ మాత్రం నామమాత్రంగా చేస్తామనడం ద్వారా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అని అర్ధమవుతుంది ఏ.పి.పి.ఎస్.సి ద్వారా భర్తీ చేయదగ్గ ఉద్యోగాలు ప్రతి యేటా భారీగా ఖాళీ అవుతున్నాయి ఆ లెక్కలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని అన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి భర్తికి సంబంధించి డి. ఎస్.సి గురించి ఎందుకు మాట్లాడటం లేదు అలాగే గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీలు పరిస్థితి ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వంలో శాఖల వారీగా ఉన్న ఖాళీలను పారదర్శకంగా గుర్తించి వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com