అరకు ( జనస్వరం ) : వైయస్సార్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జనసేన పార్టీ జనసైనికులు సిద్ధంకండి అని జనసేన పార్టీ అరకు నియోజకవర్గం మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా ఓ ప్రకటనల ద్వారా జన సైనికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకునే దాఖలు కనిపించలేదని, సమస్యలు వెలికితీసి రాష్ట్ర ప్రభుత్వానికి లైవ్లో చూపిస్తూ వాటి పరిష్కారం కోసం వినతులు ద్వారా శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా జనసేన పార్టీ నాయకుల మీద జనసైనికులు మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉద్యమాలను అణిచి వేసే ధోరణిగా ఓ పక్క వ్యవహరిస్తూనే, అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయం ఈ ప్రభుత్వం చేస్తుంటే తప్పని వేలెత్తి చూపించే జన సైనికులు మీద దమన కాండ విడిస్తుంది. ఏదేమైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటూ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. కావున ప్రతి ఒక్క జన సైనికులు గ్రామాల్లో ఉన్న సమస్యలను వెలికి తీసే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి సూచించాలని, లేనిపక్షంలో సమస్యల పరిష్కారం అయినంత వరకు ప్రభుత్వంతో ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలలో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎన్టీఆర్ ఇల్లులకు నేటి వరకు ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వలన మొండి గోడలకు పరిమితమైందని, మరణించిన కుటుంబానికి నేటి వరకు ఇన్సూరెన్స్ బీమా చెల్లించలేదని. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదని తెలిపారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్ళాను రూపాయలు ప్రతి ఒక్కరు కదలిరావాలని… కలిసి రావాలని.. ఐక్యమత్యంతో మనమందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.