
– రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరి వెల్లడి
తిరుపతి, మార్చి 27 (జనస్వరం) : శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శాఖ నూతన కమిటీని ఎంపికజేశామని రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు తెలిపారు. జిల్లా శాఖ నూతన అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా సీనియర్ కవి అరవ జయపాల్ ను నియమించామన్నారు. గత రెండేళ్లుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వుంటూ తనదైన శైలిలో సంస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నారని చెప్పారు. ఏడాది క్రితం మహతి ఆడిటోరియంలో 48 గంటలపాటు సాహితీ బ్రహ్మోత్సవాల నిర్వహణలో చురుగ్గా పనిచేశారన్నారు. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఇటీవల వరసగా రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. సంస్థ మరింత బలోపేతం కోసం భవిష్యత్తులో పలు కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలను కూడా రూపొందించారని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా కూడా విశేషసేవలందిస్తున్న జయపాల్ కు రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పదోన్నతి కల్పించినట్లు గుత్తా హరి ప్రకటించారు. అలాగే జిల్లా ప్రధానకార్యదర్శిగా కవయిత్రి, అధ్యాపకురాలు ధనాశి ఉషారాణిని ఎంపికజేశామన్నారు. గౌరవ సలహాదారుగా సాకం నాగరాజు, గౌరవాధ్యక్షులుగా డా. వి.ఆర్. రాసాని, డా. రోజారమణి, ఎన్. విశ్వనాథరెడ్డి, సమన్వయకమిటీ సభ్యులుగా పూతలపట్టు అంజయ్య, సంగీతం సుబ్రమణ్యంలు వ్యవహరిస్తారని వివరించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా రాళ్లపల్లి రజని, జి. సుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శులుగా మహేశ్వరి, మందలపు నటరాజ్, టి. గుణశేఖర్, మహిళాకార్యదర్శులుగా బెజవాడ నాగమణి, హేమమాలిని, రుక్మిణీరెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యునిగా రండ్రాసి రుద్రను నియమించామన్నారు. సంస్థ ఆశయసాధన కోసం రెండేళ్లపాటు ఈ కమిటీ పనిచేస్తుందన్నారు.