పాయకరావుపేట, నవంబర్ 10, జనస్వరం : అరట్లకోట గ్రామం జనసేన పార్టీకి కంచుకోట అని మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి పేర్కొన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి సూచనల మేరకు జనసేన పార్టీ సర్పంచ్ పులగపూరి అప్పలనరస, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల గణేష్ ఏర్పాటు చేసిన పరిచయ వేదికలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ వీర మహిళా, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి పాల్గొన్నారు. అనంతరం లక్ష్మి శివ కుమారిని సాలువతో సత్కరించారు. జనసేన నాయకులు, జన సైనికులను పరిచయం చేశారు. లక్ష్మీ శివకుమారి మాట్లాడుతూ మన అధినేత పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ, ముందుకెళ్లి సమస్యల కోసం పోరాడుతున్న, ప్రతి అడుగు ప్రజలకే పోరాటం కోసమే అని తెలియజేశారు. అలాగే సిద్ధాంతాలను ప్రజలకు వెళ్లే విధంగా, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క జనసైనికులు పనిచేయాలని కోరారు.అదేవిధంగా మీ గ్రామంలో గెడ్డం బుజ్జిగారిని ఎలా అయితే ఆదరిస్తారో అదే విధంగా నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరారు .ఈ కార్యక్రమంలో అనిశెట్టి నాగేశ్వరరావు, నడిగట్ల వరప్రసాద్, యగదేశ్ నానాజీ,పాలపర్తి సత్తిబాబు, తుమ్మల నానాజీ, గర్లంక నానాజీ, శ్రీధర్, కంకిపాటి సుబ్బారావు, వేముల గంగాధర (దారప్ప), నల్లల రత్నాజీ,గర్లంక శివరామకృష్ణ, ప్రశాంత్, భాను , గెట్టం శివ, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com