Logo
Date of Publish : 03 February 2024, 8:14 pm
Editor : Sake Naresh

అరకులో జనసేన ” గ్రామ – బాట “

    పాడేరు ( జనస్వరం ) : జనసేన"గ్రామ-బాట తడిగిరి పంచాయతీ, ఉక్కుర్బ గ్రామంలో గ్రామస్తులు పిలుపు మేరకు జనసేన పార్టీ "గ్రామ-బాట" కార్యక్రమం చేపట్టింది. మండల నాయకులు వంతాల మోహన్ గారు మరియు లకే బాల చంద్ర ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా హుకుంపేట మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ పాల్గొన్నారు. పడాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క జనసైనికుడు క్షేత్ర స్థాయిలో పార్టీ సిధ్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని తెలిపారు. "గ్రామ-బాట" పేరిట గ్రామ ప్రజలతో మమేకం కావడం, ప్రజలు జనసేన పార్టీ ని ఆధరిస్తున్న తీరుపై చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వైఎస్సార్ ప్రభుత్వం చేస్తున్న ఉచిత పధకాలు ప్రజల డబ్బులు వృధా తప్ప, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదని, మూడు రాజధానులు కడతామని చెప్పి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క రాజధాని కూడా కట్టలేదని దుయ్యబట్టారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పరదాని సురేష్, మండల నాయకులు మజ్జి మహేష్, జన్ని లింగన్న, జన్ని సతీష్, కొర్ర అప్పలరాజు, నారాయణ మూర్తి, వెంకట్ గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com