
అరకు ( జనస్వరం ) : అరకు నియోజవర్గం అందమైన అరకు లోయ లో చూడవాలిసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దేశ విదేశాల్లో నుండి ఏటా లక్షల్లో జనాభా అరకు పర్యటనకు వస్తుంటారని జనసేన నాయకులు మాదాల శ్రీరాములు అన్నారు.ఆయన మాట్లాడుతూ రోజుకు వేళల్లో వాహనాలు రాకపోకలు రాత్రి పగలు వాహన శోధకులు ప్రయాణాలు చేస్తుంటారు. అరకు పర్యటనకు వచ్చే వాహన శోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం దముకు మొదలుకొని అరకు డుంబ్రిగుడా పర్యాటక ప్రాంతాలు సందర్శించాలనే పర్యాటకులు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని తీవ్ర విమర్శలు చేశారు. ఏటా కోట్ల రూపాయలు టూరిజం వల్ల రాబడి వస్తున్న రోడ్లు మాత్రం అడుగుకో గోయి గజానికి ఓ గుంత. ఇది ఆంధ్ర ఊటీ అరకు రోడ్లు దుస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్లు బాగుచేయాలి అని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికర ప్రతినిధి మాదాల శ్రీరాములు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.