
అరకు, (జనస్వరం) : రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రకటనను స్వాగతిస్తున్నాం. కొత్తగా ప్రకటన చేసిన జిల్లాల్లో పాడేరుకి జిల్లా ప్రకటించడం చాలా అన్యాయం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాకు జిల్లా ఇమ్మని అడిగామా! మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని అడిగామా! గిరిజన యూనివర్శిటీ ఇవ్వమని ఆడిగమా! పార్లమెంట్ ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పింది మిరే గిరిజన యూనివర్శిటీ మెడికల్ కాలేజ్ ఇస్తామని ఆశలు పెట్టింది మీరు. నేడు దేశంలో జనగణ మన పూర్తి అవకుండా జిల్లాలు ప్రకటించే అవకాశం లేకపోయినా నేడు ప్రకటించారు. మొదట అరకు జిల్లా కేంద్రంగా ప్రకటించి, నేడు పాడేరు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలకు గురవుతుందని అన్నారు. హడావిడిగా పాడేరుకు మెడికల్ కాలేజ్ జిల్లాగా ప్రకటించి అరకు కు అన్యాయం చేశారని జనసేనపార్టీ పార్లమెంట్ అధికారప్రతినిధి మాదాల శ్రీరాములు ఈ సందర్భముగా ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరకుకు అన్యాయం జరిగింది. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి అరకులోయకు అన్యాయం చేసారు. ప్రకటించడం దేనికి జిల్లాకేంద్రం మార్చడం దేనికి ప్రభుత్వానికి చిత్త శుద్ధిలేదు. రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో నాటకాలాడుతుంది. ప్రభుత్వం వెంటనే అరకు నే జిల్లా కేంద్రం ప్రకటించాలి. లేని పక్షాన ప్రజాసంఘాలతో కలిసి అరకు లోయకు జిల్లా ప్రకటించే వరకు ఉద్యమం ఉదృతం చేస్తాం అని అన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా MLA స్పందించాలి. ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు, రాజకీయ పార్టీలు, రాజకీయనాయకులు, ప్రజాసంఘాలు అందరు ఏకమై జిల్లా సాధించే వరకు పోరాటంలో పాల్గొనాలని ఈ సందర్భముగా తెలిపారు. అరకు జిల్లా ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణ్ రావు, డుంబ్రిగుడా మండల నాయకులు బంగురు రామదాసు, అరకు మండల నాయకులు అల్లంగి రామకృష్ణ, డుంబ్రిగుడా నాయకులు కొనెడి చినబాబు, రాజు పాల్గొన్నారు.