అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం లింగపుట్టు గ్రామంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంలో భాగంగా పాడేరు అరకుపార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డా..వంపురు గంగులయ్య పర్యటించారు. లింగపుట్టు గ్రామ వీరమహిళలు, గ్రామప్రజలందరు సాదరంగా ఆహ్వానించి పలు సమస్యలైన తాగునీటి, వీధి రోడ్లు, డ్రైనేజి కాలువలు, పంచాయితీ నిధులు అంశాలు గురించి ప్రస్తావించారు. గ్రామస్తులతో డా..గంగులయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరు మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారు. టీడీపీ పాలన చూసేసాం, వైసీపీ పాలన చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మనలాంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు కోకొల్లలు మీరు చెప్పినట్టుగా పంచాయితీ నిధులు మల్లింపు, st, sc, bc, సంక్షేమ నిధుల మళ్లింపు, చివరికి కరోన మహమ్మారి నివారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా కాజేసి దారి మళ్లించారు. ఆదివాసీ రైతులు నుంచి నిరుద్యోగుల దాకా జీవో నెం 3 ని రద్దు చేసి దగా చేస్తున్నారని అన్నారు. కేవలం దోచుకోవడానికి టీడీపీ, వైసీపీ ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పులు చోటుచేసుకుంటుంది. మీరు కూడా ఈ మార్పుకి నాంది పలకాలి. రానున్న సమీప భవిష్యత్ లో రాబోయే ఎన్నికల్లో మీ వంతు పాత్ర పోషించాల్సివుంటుంది. అలాగే ఇన్ని సమస్యలుంటే ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వాలు రక రకాల ఎత్తుగడలతో ప్రజలను మోసం చెయ్యడానికి కుయుక్తులు పన్నుతుంది ఆ మాయలో పడొద్దు. ఈ గ్రామాంతో నాకు విడదీయలేని సంబంధం ఉందని అన్నారు. గతంలో నేను ఇక్కడ నుంచే ఉద్యమాన్ని ఉదృతం చేసాను. మీరందరు సహకరించారు. మీ బిడ్డలాగా నన్ను చూసుకున్నారు. నియోజవర్గం పరిధిలో జనసేన పార్టీ బలం రోజు రోజుకి పెరుగుతోంది ఇది వాస్తవం. మీరు మీ పిల్లల భవిష్యత్ కోసం మార్పు కొరకు నీతి, నిజాయితీ గలా జనసేన పార్టీని ఇంతలా ఆదరిస్తున్నందుకు గ్రామస్తులకు, వీరమహిళలకు, నా హృదపూర్వక అభినందనలు తెలిపారు. ఈ గ్రామ ప్రజలు సహచరులుగా, మిత్రులుగా నా వెన్నంటే నడిచారు. తీవ్రమైన కష్టకాలంలో కూడా తోడుగా నిలిచారని అన్నారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న గ్రామము లింగపుట్టు. ముక్యంగా యువత తమదైన తెలివైన రాజకీయాల వైపు అడుగేయ్యాలి. గిరిజన ప్రజలను విభజించి పాలించే కుహనవాదా రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో ప్రలోభ పెడుతూనే ఉంటుందని, వాటి జోలికి పోకూడదని తెలిపారు. ఈ సమావేశంలో సోమేలి.సోమరాజు, నందోలి మురళి కృష్ణ, మండల అధ్యక్షులు, అశోక్ సాలేబు, సోమేలి చిరంజీవి. పాలసీ మహేష్, గ్రామపెద్దలు సోమెలి లింగన్న, పల్లిబొయిన సింహాచలం, వర్కోటి బాబూరావు, గొల్లరి పురుషోత్తం, సోమేలి బాలన్న, పాలసి కొండబాబు అశేష సంఖ్యలో గ్రామ వీర మహిళలు పాల్గొన్నారు.