Logo
Date of Publish : 06 December 2021, 5:39 pm
Editor : Sake Naresh

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గం డుంబ్రిగుడా మండలం ఈరోజు జనసేనపార్టీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడా మండలాధ్యక్షుడు రాజు రామకృష్ణ చిన్న బాబు అద్వర్యం లో ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను, స్మరించుకొంటు వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడనీ, ఆయన "భారతరత్న" భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పు కై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో అరకు వేలి మండల నాయకులు రామకృష్ణ డుంబ్రిగుడా మండల నాయకులు రామదాసు, అశోక్ చినబాబు జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com