Logo
Date of Publish : 30 July 2021, 5:42 pm
Editor : Sake Naresh

జీవో నంబర్ 198ని ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదం : జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్‌

          విజయవాడ, (జనస్వరం)  :   జనసేన పార్టీ నగర కమిటీలో బీసీ, ఎస్సీ, ఎన్టీ, మైనార్జీ, మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించి 69 శాతానికిపైగా పదవులు కల్పించటంపై జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకటమహేష్‌  గారు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ గారికి సహకరించిన పీఏసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గారికి ప్రత్యేకంగా కృతజ్జతలు తెలియజేసారు. జనసేన పశ్చిమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించామని, రాబోయే రోజుల్లో నగర సమస్యలపై ప్రజల తరపున జనసేన పార్టీ బలమైనగొంతుక వినిపిస్తుందని, అతి తొందర్లోనే తేదీ ఖరారు చేసి నగర కమిటీతో పాటు నగరఅధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తామని మహేష్‌ గారు తెలియజేశారు. విజయవాడకౌన్సిల్‌లో జీవో నెంబర్‌ 198 ఆమోదించడం అంటే విజయవాడ నగరానికి చీకటి రోజని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బహుమానంగా రిటర్న్‌ గిఫ్ట్‌గా వైఎస్‌ఆర్‌సిపి కార్పొరేటర్లు, మేయర్‌, మంత్రి, ఎమ్మెల్యే తదితరులు ప్రజలకు పన్నుతో వెన్నుపోటుపాడిచారన్నారు. ఒక్కరంటే ఒక్క వైసీపి  కార్పొరేటర్‌ కూడా పన్నుల పెంపును వ్యతీరేకించకపోవడం దుర్మార్గమని, మేయర్‌ పన్నులపెంపు 15శాతం వరకు అవకాశం ఉన్నప్పటికీ తాము కేవలం 18 శాతం మాత్రమే పెంచుతున్నామని మాట్లాడం ప్రజలను వంచించడమేనన్నారు. చెత్త పన్నులు నెలకు150 రూపాయలు, నీటిపన్ను నెలకు 180 రూపాయలు సాధారణ ప్రజల దగ్గర వసూలు చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం 50 రూపాయల పన్నువిధిస్తుందంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పన్నులు 10 రెట్లు పెరగడం ఖాయమని, ఇప్పటికైనా వైసీపి కార్పొరేటర్లు చేస్తున్న మోసాన్ని నగర ప్రజలు గ్రహించి రాబోయే రోజుల్లోఈ పార్టీకి బుద్ది చెప్పాలని కోరారు. దమ్ముంటే వైఎస్‌ ఆర్సిపి కార్పొరేటర్లు, మేయర్‌, మంత్రి ఇలా ఎవరైనా సరే జీవో నెంబర్‌ 198ను 80 నిమిషాల్లో చదివి అందరికీ అర్ధమయ్యే రీతిలో వినిపించాలని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి వంశీకృష్ణ, నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్‌, కామల సోమనాథం, ప్రధాన కార్యదర్శి జి నాగేష్‌, కార్యదర్శులు పాలరజిని, ఆలియా బేగం, సంయుక్త కార్యదర్శులు సాబింకర్‌ నరేష్, ఉప్పలపాటి చాణీక్య, సాయి కిరణ్ నాయక్, రాకేష్ గౌడ్ తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com