అమరావతి, (జనస్వరం) : జనసేన పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న శ్రీ బుర్రా నాగ త్రినాధ్ ను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ప్రజా విధానాల విశ్లేషకుడుగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. విశాఖ నగర వాసి అయిన శ్రీ తినాధ్ ఉన్నత విద్యావంతుడు. తెలుగు, ఇంగ్లిష్ భాషలలో ప్రవీణుడు. యువజన నాయకుడిగా కామన్ వెల్త్ యువజన మండలిలో డిప్యూటీ హెడ్ గా పని చేస్తూ 53 దేశాలకు సేవలు అందించారు. ముఖ్యంగా పబ్లిక్ పాలసీ నేపథ్యంలో సుమారు అయిదు వేల గ్రామాలలో పర్యటించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని 'జనసేన యువ నాయకత్వం' విభాగంలో గత మూడేళ్ళుగా శ్రీ బుర్రా త్రినాధ్ తర్ఫీదు పొందారు. ఈ విభాగం శిక్షణ కార్యక్రమం సంపూర్ణముగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కొనసాగుతుంది.ఈ సందర్భంగా శ్రీ త్రినాధ్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com