ఉరవకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల కమిటీ నియామకం ఏవిధంగా పూర్తి చేయాలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు TC.వరుణ్ సూచనల మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఉరవకొండ నియోజకవర్గంలోని జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ అధ్యక్షతన 5 మండలాలలో జనసేన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్న కార్యకర్తలను గుర్తించి వారికి మండల కమిటీలలో స్థానం కల్పించడం జరిగింది. అలాగే కౌలు రైతుల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనంజయ, చంద్రశేఖర్, గౌతమ్ కుమార్, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, కార్యక్రమాల నిర్వహణ సభ్యులు అజయ్ 5 మండలాల అధ్యక్షులు చంద్రశేఖర, కేశవ, గోపాల్, సుదీర్, నగేష్ తో పాటుగా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com