అవనిగడ్డ ( జనస్వరం ) : జనసేన పార్టీ కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అవనిగడ్డ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమం దాదాపుగా 21 రోజులు దాటిపోయినా ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకపోగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ హక్కులకు భంగం కలిగించడం చాలా బాధాకరమైన విషయం. ఈ అంగన్వాడీ వర్కర్స్ అత్యవసర విభాగానికి సంబంధించిన వారు కానప్పటికీ ఈ చట్టాన్ని ఉపయోగించి వీరి గొంతు నొక్కటం దుర్మార్గమైన చర్య. అదే కాకుండా వారికి రావాల్సిన కనీస వేతనంలో ఈ నెల 3450 రూపాయలు కట్ చేసి వారి బ్యాంకు అకౌంట్లో వేయటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల మహిళల పట్ల ప్రభుత్వం వివక్ష చూపటం చాలా బాధాకరం. నా అక్కలు,నా చెల్లెలు,నా ఎస్సీలు, నా బీసీలు,అని ముసలి కన్నీరు కార్చే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బూటకపు మాటలు ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది అనీ,తమ సమస్యల కోసం పోరాటాలు చేస్తున్న వారిపైన, ప్రతిపక్ష పార్టీలు పైన, ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అణిచివేయటం చాలా బాధాకరం. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి గత కొన్ని రోజుల నుంచి వారు చేస్తున్న న్యాయమైన కోరికలు తీర్చవలసిందిగా,అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2 ను వెంటనే రద్దుచేసి, ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాము.జనసేన పార్టీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న నిరసన దీక్ష కార్యక్రమానికి,వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు జనసేన పార్టీ పూర్తిగా వారికి అండగా ఉంటుంది అనీ,వారి న్యాయమైన కోరికలు తీరేవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com