విజయవాడ ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారిని సెక్రటేరియట్లో కలసి పశ్చిమ నియోజకవర్గం ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక తప్పులు పొరపాట్లు ఉన్నాయని వీటన్నిటిని తొలగించి ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితా విడుదల చేయాలని ఫిర్యాదును అందజేసిన పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఈ కార్యక్రమంలో పొట్నూరి శ్రీనివాసరావు మరియు షేక్ అమీర్ భాషలు పాల్గోన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అనికే అనేక పొరపాట్లు& తప్పులు నమోదు చేసినారని, వీటిని సవరించకుండా ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారు కాదని. కావున పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో మరణించిన వారివి, నివాసము మార్పు చెందిన వారివి, ఒకే వ్యక్తికి రెండు ఓట్లు, మూడు ఓట్లు ,నాలుగు ఓట్లు తొలగించనవి, డిజిటల్ డోర్ నెంబర్లు సరియైన పాత డోర్ నెంబర్ల సమాచారం పొందుపరిచి, ఫోటో ఉన్న సమాచారం లేని ఓటర్ల యొక్క పూర్తి సమాచారం పొందుపరిచనవి. ఒకే డోర్ నెంబర్లు 20 ఓట్లు 30 ఓట్లు ఉన్న ఇళ్లను పూర్తిస్థాయిలో మరొకసారి పరిశీలించి, కొన్ని డోర్ నెంబర్లు ఎక్కడివో స్థానికులకై తెలియని వాటిలో ఓటర్లను మరల తనిఖీ చేసి, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను విడుదల చేయవలసిందిగా కోరినారు అందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందిస్తూ ఓటర్ల జాబితాను సరి చేస్తామని పశ్చిమ నియోజకవర్గ అధికారులకు ఈ అంశాన్ని తక్షణమే తెలియజేస్తానని మహేష్ కు తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 253 బూత్ లకు గాను సుమారు 65 బూతులలో మరణించిన వారివి, నివాసము మార్పు చెందిన వారివి, ఒకే వ్యక్తికి రెండు మూడు నాలుగు ఓట్లు తొలగించనివి, డిజిటల్ డోర్ నెంబర్లకు సరియైన పాత డోర్ నెంబర్లు సమాచారం పొందుపరచినవి, ఫోటో ఉన్న సమాచారం లేని ఓటర్ల యొక్క పూర్తి వివరాలు, ఒకే డోర్ నెంబర్లు లో 20 నుంచి 30 ఓట్లు ఉన్న సమాచారం ఆధారాలతో సహా అందజేసినారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com