Logo
Date of Publish : 18 May 2023, 2:23 pm
Editor : Sake Naresh

సమస్యలను పరిష్కరించాలని అప్పలనాయుడు డిమాండ్

    ఏలూరు ( జనస్వరం ) : ఏలూరు నియోజకవర్గం లోని 19వ డివిజన్ లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కమీషనర్ కు  పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు  వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలూరులో ఈ నెల 6 మరియు 7 వ తేదిన జనసేన పార్టీ నిర్వహించిన ప్రజా సమస్యల పై జనసేన పోరుబాట అనే కార్యక్రమంలో స్థానిక 19వ డివిజన్లో కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో స్థానిక ప్రజలు ఎదురుకొంటున్న అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటి వివరాలు ఈ దిగువన మీకు తెలియపరుస్తున్నామని అన్నారు. కొత్తూరు పెదపాడు R&B రోడ్డు నుండి 19 వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1&2 ప్రధాన రహదారి మరియు కాలనీ రోడ్లు పెద్ద పెద్ద గోతులతో ఉన్నవి.. ఈ రహదారిలోనే కాలనీ వాసులు నిత్యం ప్రయాణం సాగిస్తున్నారు.అత్యవసర సమయాల్లో లేక హాస్పిటల్ వెళ్ళడానికి స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. CC రోడ్లు వేయకపోయినా కనీసం మెటల్ రోడ్డువేసి స్థానిక ప్రజల సమస్యను పరిస్కరించండి. అలాగే కులాయి పంపు కనెక్షన్లు అనధికారికంగా రూ.6000/- వసూలు చేస్తున్నారన్నారు. కులాయి కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలని జనసేనపార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కాలనీ దారి పొడవున వీధి దీపాలు సమకూర్చాలని రాత్రి వేళల్లో పాముల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నాము. కాలనీ లో డ్రెయిన్ నిర్మాణం పూర్తి చేయాలి. అలాగే డ్రెయిన్ కీ రోడుకి కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం చేయాలని అన్నారు. కాలనీ వాసుల కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చినా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు.. వెంటనే ట్యాంక్ నిర్మాణం పనులు చేపట్టాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఏలూరు జ్యూట్ మిల్లు వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన కుండీలు పాదచారులకు అసౌకర్యంగా ఉన్నందున మరియు వంతెన చాలా పాతది అయినందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.. కావున కుండీలను తొలగించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యలు అన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కమీషనర్ గార్కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, దావూద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com