విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పాజీ రాజీనామా అనంగానే భయపడి పారిపోయారాని, ఓడిపోతావని మీకు స్పష్టంగా అర్థం అయిందని, ఉత్తర కుమారుడికి మించి ప్రగల్బాలు పలికారాని, రాజీనామా అనంగానే మాట నాలిక మెలిక పడ్డాయని, అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించాక మీకు చెమటలు పట్టాయని, మాటమీద నిలబడు రాజీనామా పత్రాన్ని ఫార్మేట్ లో తయారుచేసి ఎన్నికల అధికారికి సమర్పించలని, మీ ఓటమితో వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని, దమ్ముంటే మా సవాల్ స్వీకరించి మీ రాజీనామా పత్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి సమర్పించలని, మీరు మహేష్ గారి మీద పోటీ చేస్తును అన్నారు అంటే ఆ మాట వినంగానే మాకు సినిమా కమెడియన్ ఆలీ గుర్తుకొచ్చారని, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తాను కామెడీ చేశాడని, మీరు మీ స్థాయి పెంచుకోవడానికి మహేష్ గారి పై పోటీ చేస్తానంటూ కామెడీ చేస్తున్నారని, మీ వార్డులో మీ ద్వారా చేపట్టిన అనధికార నిర్మాణాలు తద్వారా నువ్వు వసూలు చేసిన కోట్ల రూపాయల డబ్బుల వివరాలు తొందర్లోనే ఆధారాలతో ప్రకటిస్తామని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కేబీఎన్ కళాశాల గ్రౌండ్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కాకుండా చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గా కౌన్సిల్లో తీర్మానం చేయించినందుకు మీకు అందిన లక్షల రూపాయల ముడుపులు ఎంతో పశ్చిమ ప్రజలు మర్చిపోలేదని, .సమస్యలు చెప్పమన్నావు చెప్తే దానికి పరిష్కారం ఎలాగో మహేష్ గారిని చెప్పాలంటున్నారు అంటే మీరు ఇంత అసమర్థత? అక్రమ నిర్మాణాలు మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి లేదని మరొకసారి నిరూపించారని, ముమ్మాటికీ మరుపిల్ల. చిట్టి గారి కాంగ్రెస్ కార్యాలయం విలువైన స్థలాన్ని కొట్టేయడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ లు ప్రయత్నం చేస్తున్నారని, కాంప్లెక్స్ కట్టాలని చూస్తున్నారు ఇది ముమ్మాటికీ నిజం నిజం అని, హనుమంతరావు చేపల మార్కెట్ అభివ్రుది పనులు ఎప్పటికి పూర్తి అవుతాయ సమాధానం చెప్పాలని అన్నారు